కష్టమయిన వాతావరణ పరిస్థితులలో చిత్రీకరణ జరుపుకుంటున్న రామ్


రామ్ తన రాబోతున్న చిత్రం కోసం కష్టమయిన పరిస్థితులలో చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు నెలల క్రితం గుంటూరులో మిర్చి యార్డ్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మూడు వారాల పాటు చిత్రంలో ప్రధాన భాగం చిత్రీకరించుకుంది.ప్రస్తుతం రామ్ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నారు. ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ లో చిత్రీకరణ జరుగుతుంది ఇక్కడ ఉష్ణోగ్రత 2 డిగ్రీలు. శుభ పుతేల ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం కానుంది. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. “ఒంగోలు గిత్త” అనే పేరుని పరిశీలిస్తున్నారు.

Exit mobile version