రామ్ డబల్ యాక్షన్ షో అప్పుడేనా ?

కరోనా మహమ్మారి రాకతో సినిమాల రిలీజ్ డేట్లు అతలాకుతలం అయిపోయాయి. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియకుండా పోయింది. ప్రస్తుతం దర్శకనిర్మాతలు రాబోయే రోజుల్లో పరిస్థితులను చూసుకుని పక్కా ప్లానింగ్ తో రిలీజ్ డేట్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా ‘రెడ్’.

కాగా ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నారు, కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని జూన్ లాస్ట్ వీక్ లో విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారట. మొత్తానికి కరోనా సినిమాలకు కూడా బాగానే నష్టం చేస్తోంది. ఇక ఈ సినిమాలో బ్యూటీ హెబ్బా పటేల్ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Exit mobile version