సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న రామ్ చరణ్


మగధీర సినిమాలో వర్కవుట్ అయిన సెంటిమెంట్ ని రచ్చలో కూడా ఫాలో అయిన రామ్ చరణ్ అదే సెంటిమెంట్ ని తన రాబోయే సినిమాలో కూడా కంటిన్యూ చేయబోతున్నాడు. ఇంతకు ఆ సెంటిమెంట్ ఏమిటి అనుకుంటున్నారా? చిరంజీవి హిట్ పాటలని రీమిక్స్ చేసి తన సినిమాలో వాడుకోవడం. కొండవీటి దొంగ సినిమాలోని శుభ లేఖ రాసుకున్న పాటని వివి వినాయక్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో రీమిక్స్ చేసి వాడబోతున్నారు. ఇప్పటికే ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని తమన్ స్వయంగా ధ్రువీకరించారు. గతంలో మగధీర సినిమాలో బంగారు కోడిపెట్ట, రచ్చ సినిమాలో వాన వాన వెల్లువాయే పాటలు రీమిక్స్ చేయగా రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి.

Exit mobile version