మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వివాహ వేడుక హైదరాబాదులో జరగనుంది. రిసెప్షన్ మాత్రం తిరుపతిలో జరగనుంది.తన వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనున్నట్లు, దగ్గరి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు చరణ్ చెప్పారు. రిసెప్షన్ మాత్రం భారీగా జరపనున్నట్లు చాలా మంది అతుధులను ఆహ్వానిస్తున్నట్లు
తెలిపారు. చరణ్ మరియు ఉపాసనల నిశ్చితార్ధ వేడుక డిసెంబరు 1న కన్నుల పండుగగా జరిగిన విషయం తెలిసిందే.
త్వరలోనే వివాహ తేదీని చిరంజీవి గారే స్వయంగా తెలుపుతారని చరణ్ చెప్పారు. ‘రచ్చ’ చిత్ర యూనిట్ నిన్న తిరుమల గుడిని ధర్శించుకుంది. రచ్చ చిత్రం ప్రస్తుతం తిరుపతి శివార్లలోని రాయలచెరువు లో షూటింగ్ జరుపుకుంటుంది.