వాయిదా పడ్డ రామ్ చరణ్ జంజీర్

ramcharan-zanjeer
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘జంజీర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ 12న రిలీజ్ చేయననున్నామని ఇటీవలే తెలియజేసారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఒక నెలరోజులు వాయిదా వేసి సమ్మర్ స్పెషల్ గా మే 10న విడుదల చేయనున్నారు. ఈ సినిమా 1973లో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన ‘జంజీర్’ సినిమాకి రీమేక్.

ఈ సినిమాలో బాగా ఫేమస్ అయిన షేర్ ఖాన్ పాత్రని హిందీలో సంజయ్ దత్ చేస్తుండగా, అదే పాత్రని తెలుగులో సోనూ సూద్ చేస్తున్నాడు. హిందీ – తెలుగు భాషల్లో ఒకే సారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి అపూర్వ లిఖియా డైరెక్టర్. అలాగే టాలీవుడ్ యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version