రామ్ చరణ్ మరియు తమన్నాలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న “రచ్చ” చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కొద్ది రోజుల క్రితం వీరు ఇద్దరు అన్నపూర్ణ స్టూడియోస్ లో “డిల్లకు డిల్లకు” పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ మధ్యనే ఈ చిత్ర బృందం పొల్లాచ్చిలో “సింగరేనుంది” పాట చిత్రీకరణ పూర్తి చేసుకొన్నారు. దీనితో ఈ చిత్ర చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రం సెన్సార్ కి వెళ్లనుంది. ఈ చిత్రం అనుకున్న తేదీకి విడుదల చెయ్యడానికి చిత్ర బృందం శరవేగంగా పని చేస్తుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది . దేవ్ గిల్ మరియు అజ్మల్ లు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు.ఈ చిత్రం తమిళం మరియు మలయాళంలో కూడా విడుదల కాబోతుంది.ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఏప్రిల్ 5న విడుదల అవుతుంది.