కోల్ కత్తాలో రామ్ చరణ్ మరియు వి వి వినాయక్ చిత్ర తరువాతి షెడ్యూల్

కోల్ కత్తాలో రామ్ చరణ్ మరియు వి వి వినాయక్ చిత్ర తరువాతి షెడ్యూల్

Published on Jul 13, 2012 12:05 AM IST


రామ్ చరణ్ జూలై 20 నుండి వి వి వినాయక్ చిత్రంలో పాల్గొనడానికి సిద్దమయ్యారు. కొద్ది నెలల క్రితం ఈ చిత్రం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంది తరువాత దుబాయ్ లో రెండు పాటలను చిత్రీకరించారు. తరువాత రామ్ చరణ్ తన డేట్స్ ని “ఎవడు” మరియు “జంజీర్” చిత్రానికి ఇచ్చారు. తరువాత మూడు వారాల పాటు వివాహ విరామం తీసుకున్నారు. రామ్ చరణ్ బ్యాంకాక్ లో డోకోమో యాడ్ మరియు “జంజీర్” చిత్రం కోసం రెండు వారాల పాటు పని చేశారు. తాజా సమాచారం ప్రకారం అయన బ్యాంకాక్ నుండి తిరిగి వచ్చారు ఇక్కడ నుండి కోల్ కత్తా వెళ్లి అక్కడ వి వి వినాయక్ చిత్ర చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ ఈ నెల చివరి వరకు కొనసాగనుంది. కాజల్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు