అల్లరి నరేష్ చిత్ర ఆడియోని విడుదల చెయ్యనున్న రామ్ చరణ్


అల్లరి నరేష్,రిచా పనై ప్రధాన పాత్రలలో రానున్న “యముడికి మొగుడు” చిత్రం డిసెంబర్లో విడుదలకు సిద్దమయ్యింది. “సుడిగాడు” చిత్ర విజయం తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సత్తిబాబు దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని చంటి అడ్డాల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక నవంబర్ 25న శిల్ప కళా వేదికలో భారీగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కానున్నారు. “ఐదు సంవత్సరాల తరువాత మరో చిత్రాన్ని నిర్మిస్తున్నాను ఈ చిత్రం విజయం సాధిస్తుంది అని నాకు చాలా నమ్మకం ఉంది సత్తిబాబు చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు. క్రాంతి రెడ్డి రచించిన డైలాగ్స్ చాలా బాగున్నాయి ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది త్వరలో రీ రికార్డింగ్ మొదలు పెట్టుకోనుంది” అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడి ఎంటర్ టైనర్ కానుంది అని దర్శకుడు తెలిపారు. కోటి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కే రవీంద్రబాబు సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version