తెలంగాణ ప్రభుత్వం అవగాహన కార్యక్రమానికి గెస్ట్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లి వచ్చాడు. కాగా, ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే ఓ అవగాహన కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి రామ్ చరణ్ గెస్టుగా రానున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం జూన్ 26న సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో నిర్వహించనుంది.

ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ఎలాంటి లుక్‌తో కనిపిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో మరో స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version