మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. శృతి హాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. కొన్ని రోజుల క్రితమే రామ్ చరణ్ ‘జంజీర్’ సినిమాలో మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాడు, శృతి హాసన్ ‘బలుపు’ షూటింగ్ లో బిజీగా ఉంది. మొన్నే రామ్ చరణ్ సి.సి.ఎల్ లో తన తెలుగు వారియర్స్ తరుపున ముఖ్యమైన మ్యాచ్ ఆడటం కోసం పూణే వెళ్లి వచ్చాడు.
ప్రస్తుతం తను ‘ఎవడు’ షూటింగ్లో ఉన్నాడు. వీరిద్దరి మధ్యా కాలేజిలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. ఇందులో ఆలు అర్జున్ మరియు కాజల్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.