నిజంగా నన్ను ప్రేమించే వారైతే నిద్రపోనివ్వండి..అంటున్న చరణ్

నిజంగా నన్ను ప్రేమించే వారైతే నిద్రపోనివ్వండి..అంటున్న చరణ్

Published on Jan 14, 2020 5:18 PM IST

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మొదలైపోయింది. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా లోగిళ్ళు సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలతో ముస్తాబయ్యాయి. నేడు భోగి పండుగ కావడంతో భోగి మంటల వేసి సంబరాలు జరుపుకుంటున్నారు. సంక్రాంతి సరదాలకు సెలెబ్రిటీలు ఏమి మినహాయింపు కాదు. కాగా ఈ సంక్రాంతి పండుగను మెగా ఫ్యామిలీ అంతా కలిసి జరుపు కుంటున్నారు. ముఖ్యంగా చరణ్, నిహారిక, సాయి ధరమ్, వరుణ్ ఓ చోట చేరి భోగి మంటలు వేసి పండుగ చేసుకున్నారు.

ఐతే రామ్ చరణ్ పండుగ రోజు భోగి మంటల కోసం ఉదయాన్నే నన్ను నిద్ర లేపవద్దు అన్నట్లుగా ఓ ఫన్నీ కొటేషన్ ఉన్న టి షర్ట్ ధరించి సరదా చేశారు. ‘మీరు నిజంగా నన్ను ప్రేమించే వారైతే నిద్రపోనివ్వండి..'( ఇఫ్ యు రియల్లీ లవ్ మీ..యు విల్ లెట్ మీ స్లీప్) అనే ఇంగ్లీష్ కొటేషన్ ఉన్న తన టి షర్ట్ ప్రదర్శించారు. చలి కాలంలో పొద్దునే నిద్ర లేవడం కష్టంగా ఉంటుంది అన్నట్లుగా చరణ్ పండుగ రోజు కుటుంబ సభ్యులకు ఈ ఏవిధంగా ఫన్ పంచారు. మెగా ఫ్యామిలీ లోని ధరమ్, అల్లు అర్జున్ తాజా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ సంక్రాంతి వారికి చాలా ప్రత్యేకం అని చెప్పాలి.

తాజా వార్తలు