తన టీజర్ తో ఆల్ టైం రికార్డ్ సెట్ చేసిన చరణ్.!

తన టీజర్ తో ఆల్ టైం రికార్డ్ సెట్ చేసిన చరణ్.!

Published on Oct 4, 2020 5:34 PM IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో చరణ్ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతా రామరాజుగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

అందుకు సంబంధించి రాజమౌళి కట్ చేయించిన మోస్ట్ పవర్ ఫుల్ టీజర్ ను చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చెయ్యగా దానికి భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ మంచి ఫీడ్ బ్యాక్ ను అందుకుంది. అయితే ఇపుడు ఈ టీజర్ మన టాలీవుడ్ లోనే అత్యధికంగా లైక్ చెయ్యబడిన టీజర్ గా ఆల్ టైం రికార్డు సెట్ చేసింది.

ఇంతకు ముందు వరకు సూపర్ స్టార్ మహేష్ నటించిన భారీ హిట్ చిత్రం “భరత్ అనే నేను” టీజర్ పేరిట ఉన్న 6 లక్షల 63 వేల రికార్డును మహేష్ కు అత్యంత సన్నిహితుడు అయిన ఈ యంగ్ హీరో ఒక వెయ్యి లైక్స్ తో క్రాస్ చేసి ఆ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. మరి ఇక ఈ రికార్డును తారక్ వచ్చి తన పేరిట రాసుకుంటాడేమో చూడాలి.

తాజా వార్తలు