మనసులో మాటను బయటపెట్టిన చరణ్

ram_charan
రామ్ చరణ్ నెమ్మదిగా మాస్ హీరోకి కావాల్సిన అన్ని హంగులను సంతరించుకుంటున్నాడు. ఈ బాట సరైనదే అని తన సినిమా విఅయాలు తెలుపుతున్నాయి. సినిమా జీవితమే కాక రామ్ చరణ్ కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ పోలో టీం ని కుడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ మనసులో మాటను బయటపెట్టాడు. అదేమిటి అంటే తనకు ఒక పాట పాడాలని వుందట

ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ తను చిన్నప్పుడు సంగీత సాధన చేసేవాడని ఆ టాలెంట్ ని సినిమా రంగంలో వాడలేదని తెలిపాడు. అంతేకాక తానూ తిరుపతిలో వాళ్ళ పార్టీ ఆవిష్కరణ సమయంలో వినిపించిన ‘ప్రజా రాజ్యం మీదే’ పాటను కుడా పాడినట్లు తెలిపాడు. త్వరలో తానూ నటించబోయే సినిమాలో ఒక పాటను పాడతాను అన్నట్టు తెలిపాడు. ఇప్పటికే చిరు, పవన్ లు వెండితెరపై తమ గళాన్ని వినిపించారు

రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ ఘన విజయం దిశగా పరుగులు తీస్తుంది. ఇప్పుడు కాజల్ హీరొయిన్ గా, శ్రీ కాంత్ ముఖ్య పాత్రలో కృష్ణ వంశి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యనున్నాదు

Exit mobile version