చరణ్ ఉదారత కోసం ఇంకేం చెప్తారు..!

చరణ్ ఉదారత కోసం ఇంకేం చెప్తారు..!

Published on Oct 7, 2020 10:40 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ను ఆన్ స్క్రీన్ పై మెగా ఫ్యాన్స్ ఎంతలా అయితే ఇష్టపడతారో ఆఫ్ స్క్రీన్ లో అంతకంటే ఎక్కువగా ఇష్టపడే వారు కూడా ఉన్నారు. ఒక వ్యక్తిగా చరణ్ ఎప్పుడూ ఒక మెట్టు అలా పైకి వస్తూనే ఉన్నారు. ఇపుడు తాజాగా చరణ్ తీసుకున్న ఒక మూవ్ విషయంలో మాత్రం తప్పకుండా ప్రతీ ఒక్కరూ అభినందించకుండా ఉండలేరు అని చెప్పాలి.

చరణ్ ఒక గ్రాండ్ రియాలిటీ డాన్స్ షోను అనౌన్స్ చేసారు అఫ్కోర్స్ ఇది గొప్ప విషయమే కానీ అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉంది ఈ షోలో. అయితే అపారమైన టాలెంట్ కలిగి ఉన్న సాధారణ వ్యక్తుల కోసం మాత్రం ఈ డాన్స్ షో కాదు. తమ లోపాన్ని జయించి దానిని అద్భుతంగ మలుచుకున్న దివ్యాంగుల కోసం తాను ఈ డాన్స్ షోను స్టార్ట్ చేస్తున్నట్టుగా చరణ్ ఒక వీడియో ద్వారా తెలిపారు.

తనకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అందుకు తన దివ్యాంగ సోదరులు సోదరీ మణులు తమ టాలెంట్ ను కలిగి ఉన్న వారు urlife.co.in లో ఎంట్రీలను తమ పెర్ఫవుమెన్స్ వీడియోలతో నమోదు చేసుకోవాలని కోరారు. మెంటల్ డిస్టర్బ్ అయిన ఈ కాలంలో తాను వారి వీడియోలను చూశానని అందులో వారి ప్రతిభను చూసి నాకు ఎంతో ఇన్స్పైరింగ్ గా అనిపించింది అని తెలిపారు.

అంతే కాకుండా మన దివ్యాంగ సోదరులకు మనమంతా ఈ గ్రాండ్ షోకు వెల్కమ్ చెబుదామని చరణ్ వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ఇలాంటి ఒక ప్రత్యేకమైన గొప్ప షోను ప్లాన్ చేసిన చరణ్ ఉదారత కోసం ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.

https://www.instagram.com/p/CGBuQGegKYO/

తాజా వార్తలు