డాన్స్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్న రామ్ చరణ్ !

డాన్స్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్న రామ్ చరణ్ !

Published on Oct 6, 2020 1:03 AM IST


రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఒకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు చూసుకుంటూనే అనేక సామాజిక అంశాల పట్ల కూడా స్పందిస్తుంటారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నఆమె తాజాగా యువర్ లైఫ్ పేరుతో ఒక ఆన్ లైన్ వెబ్ సైట్ మొదలుపెట్టారు. అందులో స్టార్ నటి సమంతతో కలిసి బాడీ, మైండ్, హీల్, పోషకాహారం అనే నాలుగు ముఖ్యమైన అంశాల గురించి అనేక విషయాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. అంతేకాదు కోవిడ్ జాగ్రత్తలను కూడ వివరిస్తూ సందేహాలను నివృత్తి చేస్తున్నారు.

ఇందులోనే ‘మనం ఊరు మన బాధ్యత’ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేసి దాని లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే దివ్యాంగుల్లో ఉన్న డ్యాన్స్ టాలెంట్ ను ప్రపంచానికి తెలియజేయడానికి హీల్ యువ లైఫ్ త్రు డ్యాన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆన్ లైన్ టాలెంట్ షోకు రామ్ చరణ్ సైతం తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఆయనతో పాటే ప్రముఖ కొరియోగ్రఫర్లు ప్రభుదేవా, ఫరాఖాన్ సైతం షోలో పాల్గొంటారు. ఇలా దివ్యాంగుల కోసం ఉపాసన ప్రత్యేక కార్యక్రమం నిర్వహింస్తుండటం దానికి చరణ్ తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండటం అభినందించదగిన విషయం.

తాజా వార్తలు