గత వారం కన్యాకుమారిలో షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ లో చిన్న వేడుకకు హాజరైన రామ్ చరణ్ కు మీడియా వల్ల చిన్న డైలమాలో పడ్డాడు. పవన్ రాజకీయ ప్రవేశం పై మీ అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్నకు తెలివిగా నేను మా నాన్నగారి మాటకి/ బాటకే విలువనిస్తాను అని చెప్పాడు
ఇప్పుడు కృష్ణవంశీ తీస్తున్న సినిమా కోసం చెర్రి పొల్లాచి వెళ్లనున్నాడు. దాదాపు రెండు వారాలు సాగనున్న ఈ షెడ్యూల్ లో ఒక పాటను కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్. ఇందులో శ్రీకాంత్, కమిలిని ముఖర్జీ మరియు రాజ్ కిరణ్ ముఖ్య పాత్రధారులు. ఈరోజు మొదలుకానున్న షెడ్యూల్ మార్చ్ 26కు ముగియనుంది
థమన్ సంగీతదర్శకుడు. బండ్ల గణేష్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్ లుక్ మార్చ్ 27న విడుదలకానుంది