ఈ ఏడాది మొదట్లో బాక్స్ ఆఫీసు దగ్గర 40 కోట్లకు పైగా సంపాదించి మూడు చిత్రాల్లో నటించిన అతి కొద్ది మంది తెలుగు నటుల జాబితా లో చేరిన నటుడు రామ్ చరణ్. దీనికి తోడు రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రం మలయాళం లో ‘భయ్యా’ పేరుతో రిలీజ్ అయింది. కేరళ లో ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం మజ్హవిల్ మనోరమ అనే కేరళ టి. వి. చానల్ ఈ చిత్రం సాటిలైట్ హక్కుల్ని మంచి ధరకి కొన్నుకుంది. సమాచారం ప్రకారం మలయాళం లో డబ్ అయిన తెలుగు సినిమాల్లో ‘ఎవడు’ చిత్రానికి అత్యధిక ధర వచ్చింది. ఈ చిత్రం లో అతిధి పాత్ర పోషించిన అల్లు అర్జున్ కి కేరళలో చాలా అభిమానులు వుండడం ఈ చిత్రానికి కలసి వచ్చింది.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో రామ్ చరణ్ , శృతి హాసన్, అమి జాక్సన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం రామ్ చరణ్ కృష్ణ వంశీ దర్శకత్వం లో రాబోతున్న ఒక చిత్రం షూటింగ్ కోసం రామేశ్వరంలో వున్నాడు. ఈ కుటుంబ కధా చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.