నవంబర్లో రానున్న ఒంగోలుగిత్త ఆడియో


ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఒంగోలుగిత్త’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల నవం మూడవ వారంలో జరగనుంది. డిసెంబర్లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సరైన ఫాంలో లేని బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో హిట్ కొట్టి తన టాలెంట్ ని మరోసారి నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. కృతి కర్బంద హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Exit mobile version