రేపటి నుండి ప్రారంభం కానున్న రామ్ – భాస్కర్ సినిమా షూటింగ్


‘ఎందుకంటే పేమంట’ తరువాత రామ్ చేయబోయే సినిమా షూటింగ్ రేపటి మే 27) నుండి ప్రారంభం కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రామ్ నటించనున్న సినిమా ముహూర్తం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ రామ్ తన ట్విట్టర్ అకౌంటులో తెలిపాడు. భాస్కర్ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా కోసం గుంటూరుకి బయల్దేరాను అంటూ పేర్కొన్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాబోతున్నది. ఎ వెంకటేష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ నటిస్తిన్న ఎందుకంటే ప్రేమంట షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. జూన్ 8న ఎందుకంటే ప్రేమంట చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version