తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క హీరోకి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది ఉదాహరణకి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలని, లేదా నెంబర్ వన్ స్థానానికి చేరుకోవాలని, లేదా డైరెక్టర్ అవ్వాలని లేదా ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టాలని ఇలా రకరకాల లక్ష్యాలు ఉంటాయి. మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి కూడా రెండు లక్ష్యాలున్నాయని అందులో ఒకటి తీరిపోయిందని చెబుతున్నాడు. అవేంటో రామ్ మాటల్లోనే ‘ నా లైఫ్ లో నాకున్న లక్ష్యాలు రెండే మొదటిది నటున్ని అవ్వడం, రెండవది ఒక పేద గ్రామాన్ని దత్తత తీసుకోవడం. ఈ రెండింటిలో మొదటిది 15 సంవత్సరాలకే నెరవేరింది. ఇక రెండవది ఎప్పటికి నెరవేరుతుందో? అని’ రామ్ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం రామ్ – విక్టరీ వెంకటేష్ గారితో కలిసి చేయనున్న ‘బోల్ బచ్చన్’ రీమేక్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.