గోపీచంద్ సరసన రాకుల్ ప్రీత్

Gopichand

రాకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటుంది. నితిన్, మంచు మనోజ్ లతో జంటగా నటించడానికి ఒప్పుకున్న ఈ భామ ఇప్పుడు గోపీచంద్ సరసన హీరోయిన్ గా అంగీకరించింది. ఈ వేసవి నుండి ఈ సినిమా మొదలుకానుంది

ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను శ్రీవాస్ తెరకేక్కిస్తున్నాడు. ప్రస్తుతం అనూప్ రూబెన్స్ తో దర్శకుడు మ్యూజిక్ సిట్టింగ్ లలో పాల్గుంటున్నాడు. గత ఏడాది రాకుల్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించి హిట్ ని అందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు

ప్రస్తుతం రాకుల్ గౌతం కార్తీక్ సరసన ఒక తమిళ సినిమాలో నటిస్తుంది. అలా మొదలైంది సినిమాకు ఈ చిత్రం రీమేక్. నికీషా పటేల్ మరో హీరోయిన్

Exit mobile version