‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాలో నటించిన రాకుల్ ప్రీత్ చాలా ఆనందంలో వుంది. ముందుగా ‘కెరటం’ అనే సినిమాలో మెరిసినా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా ఆమెకు పూర్తిస్థాయి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా అన్ని చోట్లా పెద్ద విజయాన్ని సాధించింది. ఇంకా పలు చోట్ల ఆడుతూనే వుంది. భారీ ఎత్తున ఆఫర్లు వస్తున్నా ఈ భామ సినిమాల ఎంపికలో జాగ్రత్త వహిస్తుంది
ఇప్పుడు రాకుల్ హిందీ సినిమాల వైపు దృష్టి పెట్టింది. కాలేజి కుర్రాళ్ళ నేపధ్యంలో సాగనున్న యారియన్ అనే హిందీ సినిమాలో ఈభామ నటిస్తుంది. ఈ సినిమా పాటలు, వీడియోలు ప్రాచుర్యం పొందాయి. అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ భామ బిగ్ బాస్ 7 లో సల్మాన్ సరసన డ్యాన్స్ చెయ్యడం. ఈ హిందీ సినిమా జనవరి 10న విడుదలకానుంది
ఇదిలావుంటే ఇక్కడ ఆమె త్వరలో ఆది నటించిన ‘రఫ్’ సినిమాలో కనబడనుంది. చాలా శాతం షూటింగ్ ముగించుకుని వచ్చే యేడాది విడుదలకు సిద్దంగావుంది