తమిళ చిత్ర సీమలోనే కాక యావత్ భారతదేశానికే రజినికాంత్ మరియు కమల్ హాసన్ సుపరిచితులు. అంతేకాక వీరిద్దరూ మంచి మిత్రులు కూడా.
రజిని కాంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తూ తన కూతురు సౌందర్య అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘కొచ్చాడయాన్’ సినిమా మోషన్ క్యాప్చుర్ పరిజ్ఞానంతో మనముందుకు రానుంది. ఇదిలావుంటే కమల్ మరోసారి విశ్వరూపాన్ని ‘విశ్వరూపం2’ ద్వారా చుపించానున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు కమల్ దర్శకత్వమే కాక నిర్మాతగా కుడా వ్యవహరిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు రజిని పుట్టినరోజైన డిసెంబర్ 12 న విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.
మామోలుగా డిస్ట్రిబ్యూటర్లు రెండు పెద్ద సినిమాలను ఒకేసారి విడుదల చెయ్యడానికి ఇష్టపడరు. కానీ ఈ సినిమాను ఒకే రోజు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాక ఆ సమయంలో మొత్తం తమిళనాడు అంతా ఈ రెండు సినిమాలు మాత్రమే ప్రదర్శితం అయ్యేలా చూస్తున్నారు. ఎం జరుగుతుందో వేచి చూద్దాం మరి