విడుదలైన రజిని విక్రమసింహా ఆడియో

విడుదలైన రజిని విక్రమసింహా ఆడియో

Published on Mar 9, 2014 7:30 PM IST

Kochadaiyaan-Audio-Launch-(

ఈరోజు చెన్నైలో అత్యంత వైభవంగా విక్రమ్ సింహా ఆడియో విడుదలైంది. షారుఖ్ ఖాన్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. శంకర్, కె బాలచందర్, ఏ.వి.ఎం సర్వనన్, కె.ఎస్ రవి కుమార్, దీపికా పదుకునె వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. అంతేకాక ఈ వేడుకలో ఏ.ఆర్ రెహమాన్, జాకీ షరీఫ్, సౌందర్య రజినికాంత్, రజినీకాంత్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

ఈ వేడుకలో చిత్ర బృందమంతా స్పీచ్ లు ఇచ్చి తమతమ టెక్నీషియన్ల పనితీరును పొగిడారు . తరువాత నిర్మాతలు ఈ సినిమాకు 125కోట్లు ఖర్చయిందని. ఆరు భారతీయ భాషలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శితం కానుందని తెలిపారు. విడుదల అనంతరం ఈ చిత్రాన్ని జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ భాషలలో డబ్బింగ్ చేయనున్నట్లు తెలిపారు

ఈ చిత్రంలో రజిని 3 విభిన్న అవతారాలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన 9పాటలు మంచి స్పందనను అందుకున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 2వ వారంలో మనముందుకు రానుంది

తాజా వార్తలు