‘కొచ్చాడియన్’ పై అంచనాలు పెంచిన రజినీ స్టేట్ మెంట్

‘కొచ్చాడియన్’ పై అంచనాలు పెంచిన రజినీ స్టేట్ మెంట్

Published on Mar 10, 2014 1:26 PM IST

Kochadaiyaan
​​
సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడు కూడా ఆడంబరంగా కనిపించే వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు ఒకే విదంగా వుండే వ్యక్తి. ఆయన ఎప్పుడు దేనిని తక్కువ చేసి మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఏదైనా చెప్పేటప్పుడు కోట్లాది మంది అభిమానులను దృష్టిలో పెట్టుకొని చెబుతాడు. కొచ్చాడియాన్ (తెలుగులో ‘విక్రమసింహ’) ఆడియో ఫంక్షన్ లో రజనీకాంత్ ఆ సినిమా గురించి ఎంతో బావోద్వేగంతో మాట్లాడాడు. ఈ సినిమా ఇండియా సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నాడు. రజినీకాంత్ ఈ సినిమా గురించి ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈ సినిమా పై ఇప్పుడు భారీగా అంచనాలు పెరిగాయి.

రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా మోషన్ కాప్చర్ టెక్నాలజీ ఆదారంగా నిర్మించారు. ఈ సినిమా విజ్యువల్ ఎఫెక్ట్ కోసం ఇంటర్నేషనల్ టెక్నిషియన్స్ పని చేశారు. ‘కొచ్చాడియాన్’, ‘విక్రమసింహ’ సినిమా తమిళ, తెలుగు రెండు భాషల్లో ఒకేసారి సమ్మర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు