పొగత్రాగడం మానేసిన రజినీకాంత్ అభిమానులు

పొగత్రాగడం మానేసిన రజినీకాంత్ అభిమానులు

Published on Dec 17, 2012 5:00 PM IST

Rajinikanth-(1)
దక్షిణ భారత దేశంలో స్టార్స్ అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అంతే కాకుండా స్టార్స్ అభిమానులు వారి పేరుతో చేసే మంచి పనులకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. రక్త దానం గురించి చిరంజీవి చెప్పగానే అయన అభిమానులు కొన్ని వేల మంది ఇప్పటికి రక్తదానం చేస్తున్నారు. ఇలానే ఈ మధ్య రజినీకాంత్ పుట్టినరోజున “గతంలో నేను సిగరెట్ ఎక్కువగా తాగే వాడిని అలానే మద్యాన్ని కూడా ఎక్కువ సేవిన్చేవాడిని దాని కారణంగా నా ఆరోగ్యం బాగా దెబ్బతింది అవి మానేసాక నా ఆరోగ్యం మెరుగుపడింది. “శివాజీ’ చిత్రంతో తెర మీద పొగ తాగడం మానేసాను పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం, వెంటనే నిలిపివేయండి” అని అన్నారు. ఈ మాటలకు అభిమానుల నుండి అద్భుతమయిన స్పందన కనిపించింది. తమిళనాడులో పలు ప్రాంతాలలో అభిమానులు పొగ తాగడం నిలిపేశారు. ఈ సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏది ఏమయినా రజినీకాంత్ మరియు అభిమానుల చర్యను అభినందించి తీరాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు