‘నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే’ ఈ డైలాగ్ తెలియని సిని అభిమాని ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు.సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో మర్చిపోలేని చిత్రం, అయన కెరీర్లో మైలు రాయిగా నిలిచిన సూపర్ హిట్ సినిమా భాషా సినిమా దర్శకుడు సురేష్ కృష్ణ ఈ చిత్ర అనుభవాలను త్వరలో పుస్తక రూపంలో అందించనున్నారు. 1995 లో విడుదలైన ఈ సినిమా తమిళ, తమిళ భాషల్లో భారీ విజయం సాధించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమా కథ, కథనాన్ని చాలా మంది దర్శకులు తమ సినిమాల్లో కథా వస్తువుగా వాడుకున్నారు వాడుకుంటూనే ఉన్నారు.