సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ వచ్చి చాన్నాళ్ళు కావస్తుంది. రజిని కొత్త సినిమా విక్రమసింహా ఆడియో విడుదల వేడుకకు మార్చ్ 10న ఆయన ఇక్కడికి వస్తారు అని తెలిపినా అది జరగలేదు. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ సినిమా ప్రచారం చేసే భాగంలో చిత్ర బృందమంతా ఒక ప్రత్యేక వేడుక నిర్వహించనుంది
ఏప్రిల్ 19న జరిగే ఈ వేడుకలో రజిని పాల్గుంటాడని సమాచారం. ఇప్పటికే చెన్నై, ముంబైలలో ప్రచారం చేసిన ఈ సినిమా బృందం ఇటువంటి చిత్రం తెరకెక్కించడం ఎంత కష్టమో పూస గుచ్చినట్టు తెలిపారు. రెండేళ్ళ కష్టంతో, 120 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కింది అని దర్శకురాలు సౌందర్య రజినికాంత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చెన్నై, హాన్ కాంగ్ లలో నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, మే 9న భారీ రీతిలో విడుదలచేస్తామని తెలిపారు
ఈ సినిమాకు కె.ఎస్ రవికుమార్ కధను అందించారు. మోషన్ క్యాప్చుర్ పరిజ్ఞానంతో ఈ సినిమా తెరకెక్కింది. రజిని సరసన దీపికా పదుకునే నటించింది. రజిని ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు