సూపర్ స్టార్ రజినీకాంత్ కి దక్షిణ భారతదేశంలో వున్న పాపులారిటీ చెప్పడం సాధ్యంకాదు. దక్షిణ భారత దేశంలో మంచి పాపులారిటీ ఉన్న నటులు, నటీమణులు వారి పాపులారిటీని రాజకీయలో ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వారు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రెండు రాష్ట్రాల్లో వున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం ఇప్పటి వరకు తన పేరు ప్రతిష్టలను రాజకీయాల కోసం ఉపయోగించలేదు. ఈ మధ్య జరిగిన ‘విక్రమసింహ’ ఆడియో ఫంక్షన్ లో ఒక జర్నలిస్ట్ రజినీకాంత్ ని పొలిటికల్ ప్లాన్స్ గురించి అడిగాడు. ఆయన మీరు ఎవరికి మద్దతు తెలుపుతారు నరేంద్ర మోడీ లేక కేజ్రీవాల్ అని అడగ్గా రజినీకాంత్ సమాదానం చెప్పకుండా సున్నితంగా తిరస్కరించారు. ఆయన ” దయచేసి రాజకీయాలు మాట్లాడొద్దు’ అని అన్నాడు.
గత కొద్ది సంవత్సరాలుగా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఆయన పార్టీ కూడా పెడున్నాడని అన్నారు. కానీ ఆయన మాత్రం దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. అయితే రజినీకాంత్ సమీపంలో వుండే వారు మాత్రం రజినీకాంత్ జీవితంలో రాజకీయాల్లోకి రాడని చెబుతున్నారు.