రూబిక్స్ క్యుబ్స్ తో రజినీకాంత్ బొమ్మ గీసిన విద్యార్థులు

రూబిక్స్ క్యుబ్స్ తో రజినీకాంత్ బొమ్మ గీసిన విద్యార్థులు

Published on Mar 13, 2014 2:10 PM IST

Rajinikanth-made-of-Rubik's

సూపర్ స్టార్ రజనీకాంత్ కి ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఫాన్స్ వున్న విషయం తెలిసిందే. వారందరూ ఆయన పై వున్న అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తూ వుంటారు. దానిలో బాగంగా కొంతమంది రాయితో అలాగే మరి కొంత మంది మైనంతో విగ్రహాలను, ఆయన కట్ అవుట్ ఏర్పాటు చేస్తూ వుంటారు. కానీ హైదరాబాద్ లోని బిట్స్ పిలాని కాంపస్ లోని విద్యార్థులు రజినీకాంత్ పై వున్న అబిమానాన్ని కొత్తగా, వైవిద్యంగా, క్లాస్ గా వ్యక్తం చేశారు. వారు రోబిక్స్ క్యూబ్స్ లతో దానిలోకి కలర్ల సహాయంతో రజినీకాంత్ బొమ్మని వేసి వారి అభిమానాన్ని వ్యక్తం చేశారు. వారు వేసిన ఫోటో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో రౌండ్స్ కొడుతోంది. కొత్తరకం ఆలోచనతో అందరిని ఆకర్షించే విదంగా రోబిక్స్ క్యూబ్స్ తో రజినీకాంత్ బొమ్మని గీయడంతో ప్రముఖులు విద్యార్థులను ప్రశంసిస్తున్నారు.

తాజా వార్తలు