‘కూలీ’పై తప్పుడు అంచనాలు పెట్టుకుంటున్నారా?

‘కూలీ’పై తప్పుడు అంచనాలు పెట్టుకుంటున్నారా?

Published on Aug 7, 2025 5:00 PM IST

coolie

ప్రస్తుతం మూవీ లవర్స్ లో భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేసిన చిత్రం “కూలీ” కూడా ఒకటి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఏమో కానీ ఇప్పుడు రిలీజ్ కి దగ్గరకి వస్తున్న సమయంలో మరింత పెరుగుతూ వస్తున్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే హైప్ కాస్తా ఓవర్ హైప్ అయ్యిపోతుంది అని చెప్పాలి.

లోకేష్ పెట్టిన స్టాండర్డ్స్ రీత్యా కూలీ సినిమా కోసం అదే రీతిలో చర్చ నడుస్తుంది. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ గత చిత్రాలు విక్రమ్, ఖైదీ సినిమాలకి వారికి వారే లింక్ పెట్టేసుకొని లేని పోనీ ఆశలు కలిగించుకుంటున్నారు. ఒకవేళ నిజం అయితే ఓకే కానీ కాకపోతే దారుణంగా డిజప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఎఫెక్ట్ పడొచ్చు. మరి తప్పుగా పెట్టేసుకుంటున్న ఈ అంచనాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.

తాజా వార్తలు