కృష్ణుడి అవతారంలో సూపర్ స్టార్ రజినీ?

కృష్ణుడి అవతారంలో సూపర్ స్టార్ రజినీ?

Published on Nov 8, 2012 4:20 PM IST

అన్నీ అనుకున్నట్టుగా జరిగితే సూపర్ స్టార్ రజినీ కాంత్ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించబోయే సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా ఇటీవలే బాలీవుడ్లో విడుదలై విజయం సాదించిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రిమేక్. ఈ సినిమాని హిందీలో అక్షయ్ కుమార్ నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్ర రీమేక్ రైట్స్ విషయమై ఐశ్వర్య ముంబైలో అక్షయ్ తో చర్చలు జరుపుతున్నారు. తమిళ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.

ఈ సినిమాలో రజినీ ఏ పాత్ర చేస్తారా? అనే ఆలోచనలో పడ్డారు. ఈ సినిమాలో రజినీ శ్రీ కృష్ణుడి పాత్రలో కనిపించే అవకాశమే ఎక్కువ ఉంది. హిందీ వెర్షన్లో ఈ పాత్రని అక్షయ్ కుమార్ పోషించారు. ఇది కనుక కార్య రూపం దాలిస్తే ఖచ్చితంగా ఇదొక క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఇది కాకుండా ప్రస్తుతం రజినీ తన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ‘విక్రమసింహా’ సినిమాలో నటిస్తున్నారు మరియు ఇది 2013లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు