అక్కడ రజినీ, ప్రభాస్ మాత్రమే.. లిస్ట్ ఎండ్!

ఇండియన్ సినిమా దగ్గర భారీ మార్కెట్ ఉన్న టాప్ స్టార్స్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంకా సూపర్ స్టార్ రజినీకాంత్ లు కూడా ఒకరు. అయితే ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలకి కర్ణాటకలో కూడా సాలిడ్ హైప్ ఉంది. ఇలా తన నుంచి 6 చిత్రాలు కన్నడ మార్కెట్ లో 20కోట్లకు పైగా వసూలు చేసాయి.

మరి ఇదే మార్క్ ని సొంతం చేసుకున్న హీరో ఎవరు అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ అట. తన లేటెస్ట్ సినిమా కూలితో తను ఈ మార్క్ చేరి ప్రభాస్ తో సమం అయ్యారు. ఇలా 20 కోట్లు వసూలు చేసిన 6 సినిమాలు ఉన్న హీరోలుగా ప్రభాస్, రజినీకాంత్ లు మాత్రమే నిలిచారట. వీరి దగ్గరలో మరో హీరో లేరని అక్కడితో లిస్ట్ ఎండ్ అయిపోయినట్టు తెలుస్తోంది.

Exit mobile version