ఈ నెల 16 నుండి రాజేంద్రప్రసాద్ కొత్త సినిమా

ఈ నెల 16 నుండి రాజేంద్రప్రసాద్ కొత్త సినిమా

Published on Apr 8, 2013 7:00 AM IST

Rajendra-Prasad
డా. రాజేంద్ర ప్రసాద్ ప్రదానం పాత్రలో నటించనున్న సినిమా ‘వసుంధర నిలయం’. ఈ సినిమాలో న్యాయవాది సంజీవ్ చతుర్వేది పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నారు. సక్సెస్ ఫుల్ లాయర్ గా వున్న అయన నిరాశకు లోనై ఒక యువ బృందం సహాయంతో ఎలా మాములుగా మరతాడనేది ఈ సినిమా కథాంశం. రవీశన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని ట్రెండ్ సెట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకం పై పగడాల నరేంద్ర కుమార్ నిర్మిస్తున్నాడు. దీనిలో జయశ్రీ, మాదాల శ్రీనివాస్, శాండీ, సూర్య, ప్రభాస్ శ్రీను మొదలగు వారు నటిస్తున్నారు. సామాజిక అంశాలతో కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 16 నుండి షూటింగ్ ప్రారంభంకానుంది.

తాజా వార్తలు