బన్ని చిత్రంలో పోలీసు గా నటిస్తున్న రాజేంద్ర ప్రసాద్

బన్ని చిత్రంలో పోలీసు గా నటిస్తున్న రాజేంద్ర ప్రసాద్

Published on Jan 25, 2012 2:05 PM IST


రాబోతున్న అల్లు అర్జున్ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రం లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర చాల కీలకం కానుంది చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ పాత్ర హాస్యం మరియు సెంటిమెంట్ మిళితంగా ఉంటుంది అని చెప్పారు. ఇలియానా ఈ చిత్రంలో కథానాయికగా చేస్తున్నారు. బ్రహ్మానందం మరియు ఎం.ఎస్.నారాయణ లు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్నిసాధ్యమయినంత వేగంగా పూర్తి చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజా వార్తలు