అల్లు అర్జున్, ఇలియానా జంటగా నటిస్తున్న ‘జులాయి’ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా డబ్బింగ్ పనులు శబ్దాలయ స్టుడియోలో జరుగుతుండగా మాకు అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసారు. ఈ సినిమాలో ఆయన పోలిస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా డబ్బింగ్ పూర్తి చేసారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా పై యువతలో భారీ అంచనాలే ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో జూన్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య సమర్పిస్తున్నారు.