యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రస్తుతం తన కెరీర్‌లో టఫ్ ప్యాచ్‌లో వెళ్తున్నారు. ఆయన హీరోగా సినిమాలు చేసినా అవి వర్కవుట్ కాకపోవడంతో విలన్ పాత్రలు, క్యారెక్టర్ పాత్రలకు ఓకే చెప్పాడు. ఇక రాజశేఖర్ ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమాలో విలన్ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘రౌడీ జనార్థన్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. దర్శకుడు పవన్ సాదినేని డైరెక్షన్‌లో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘మగాడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ కెరీర్‌లో ఇదే టైటిల్‌తో గతంలో వచ్చిన ‘మగాడు’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు తిరిగి ఈ సూపర్ హిట్ టైటిల్‌ను ఆయన మరోసారి వాడుతుండటంతో ఈ సినిమాపై కూడా కొంత బజ్ క్రియేట్ అవనుంది.
మరి అప్పట్లో రాజశేఖర్‌కు సూపర్ హిట్ అందించిన ‘మగాడు’ టైటిల్, ఇప్పుడు ఆయనకు సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.