పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న “ది రాజా సాబ్” సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ గ్రీస్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం తీవ్రంగా శ్రమిస్తూ షూటింగ్‌ను పూర్తి చేస్తోందట. గ్రీస్ షెడ్యూల్ చాలా హెక్టిక్‌గా సాగుతోందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
దర్శకుడు మారుతి సారథ్యంలో టెక్నికల్ టీమ్ అత్యంత వేగంగా పనిచేస్తోందట. ప్రభాస్, మాళవిక మోహనన్ సహా మొత్తం బృందం ప్రస్తుతం గ్రీస్‌లో పాట చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యా్క్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.