తెలుగు సినిమా కొత్త హంగులతో సిద్ధమవుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ‘రాజన్న’ చిత్రం విదేశాలలో ప్రదర్శితమయ్యే ప్రింట్స్ లో సబ్ టైటిల్స్ తో ప్రదర్శితం కానుంది. నిర్మాణ సభ్యులు ఈ విషయాన్ని స్వయంగా మాకు తెలిపారు. అన్ని భాషల వారికీ సులువుగా అర్ధమయ్యే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డిసెంబరు 21న విదేశాలలో ప్రీమియర్ షోస్ వేయాలని నిర్ణయించినట్లు, ప్రింట్స్ కూడా పంపించడం జరిగిందని చెప్పారు. ఈ చిత్రాన్ని విదేశాలలో నాగార్జున గారే స్వయంగా విడుదల చేయబోతున్నారు. రాజన్న చిత్రాన్ని విదేశాలలోని కొన్ని ప్రాంతాలలో నాగార్జున గారు ‘అన్నపూర్ణ స్టూడియోస్ ఇంటర్నేషనల్ ఐఎన్సీ’ ద్వారా భారీ గా విడుదల చేయబోతున్నారు. నాగార్జున మరియు ఇతర నిర్మాణ సభ్యులు రాజన్న చిత్రం నాగార్జున గారి కెరీర్లో మర్చిపోలేని చిత్రం అవుతుంది అని నమ్మకం వ్యక్తం చేసారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం వహించగా ఆయన గారి అగ్ర దర్శకుడు అయిన రాజమౌళి గారు కొన్ని కీలక సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున గారు ఈ చిత్రాన్ని నిర్మించారు.
విదేశాలలో సబ్ టైటిల్స్ తో ప్రదర్శితం కానున్న రాజన్న
విదేశాలలో సబ్ టైటిల్స్ తో ప్రదర్శితం కానున్న రాజన్న
Published on Dec 19, 2011 9:46 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?