రాజమౌళి మరియు ఆయన కుటుంబం హైదరాబాదులోని ప్రసాద్స్ మల్టీ ప్లెక్స్ లో రెగ్యులర్ గా తమ సన్నిహితుల చిత్రాలను చూస్తూ ఉంటారు. అయితే ఈసారి కరోనా రాకతో థియేటర్స్ బంద్ అవ్వడంతో సినిమాలకు చాల గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం సినిమాలన్నీ ఓటీటీలో విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో నాని ‘వి’ సినిమా కూడా నిన్న రాత్రి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది.
అయితే రాజమౌళితో నాని చాలా సన్నిహితంగా ఉంటుండటంతో నాని సినిమాలను రాజమౌళి బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటారు. కాగా రాజమౌలి తన ఫామ్ హౌస్‌లో వి సినిమాని ఫ్యామిలీతో కలిసి ప్రైవేట్ స్క్రీనింగ్ లో చూశారు. రాజమౌళి కుటుంబంతో పాటు కీరవాణి కుటుంబం కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో దిగిన ఫోటోలను కార్తికేయ సోషల్ మీడియాలో పోస్ట్ చిత్రబృందానికి విషెస్ తెలిపారు.
Missing the FDFS hungama of #VTheMovie. In a normal world all of us would’ve watched the 8.45 AM show at Prasadz!
But looks like this is also going to be fun… ????
Wishing the team the ✌????best!@NameisNani @isudheerbabu @i_nivethathomas @aditiraohydari @mokris_1772 @SVC_official pic.twitter.com/lyLMVq9O65— S S Karthikeya (@ssk1122) September 5, 2020