“RRR” కోసం ఆలియాతో ప్రయోగం.?

“RRR” కోసం ఆలియాతో ప్రయోగం.?

Published on Oct 8, 2020 7:08 PM IST

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యుంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ విజువల్ అండ్ విజువల్ ట్రీట్ “రౌద్రం రణం రుధిరం”. పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కుస్తున్న ఈ ప్రాజెక్ట్ ను రాజమౌళి మన దక్షిణాది భాషలతో పాటుగా హిందీలో కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

అందుకు తగ్గట్టుగానే పలు కీలక పాత్రలకు బాలీవుడ్ నటులను ఎంపిక చేసుకున్నారు. అయితే వారి బాలీవుడ్ కు చెందిన స్టార్ నటులు అజయ్ దేవ్ గన్ అలాగే ఆలియా భట్ లు ముఖ్యులు. లేటెస్ట్ గా ఆలియా షూట్ పై తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇపుడు ఇది కాకుండా RRR మేకర్స్ ఆలియాతో ఒక ప్రయోగం చేయించనున్నారని తెలుస్తుంది.

ఈ చిత్రానికి హిందీ వెర్షన్ లో ఎలాగో ఆలియానే డబ్బింగ్ చెప్పుకుంటుంది అని తెలిసిందే. కానీ ఇపుడు ఈమె తన తెలుగు వెర్షన్ కు కూడా సొంత గాత్రం ఇచ్చుకోనున్నట్టు తెలుస్తుంది. మరి మొట్ట మొదటి సారిగా తెలుగులో ఆలియా చేస్తున్న ప్రయోగం ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు