సినీ, రాజకీయ ప్రముఖులలో ప్రతి ఒక్కరు కూడా రానున్న ఎన్నికలలో భాగంగా ప్రచారం లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ ఎన్నికలలో లోక్ సత్తా తరుపున ప్రచారం చేస్తున్నారు. గతంలో ఆయన కొద్దిపాటి పార్టీ సభల్లో మాత్రమే పాల్గొనే వారు.
కానీ ఇప్పుడు మాత్రం లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కోసం రాజమౌళి ప్రచారం చేస్తున్నారు. మల్కాజ్ గిరి లోక్ సభ స్దానంకు పోటీ చేస్తున్న జేపీ తరుపున ఆయన విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
దీంతో రామోజీ ఫిల్మ్ సిటీ లో యుద్ద సన్నివేశాలు ముగించుకొన్న ‘బాహుబలి’ చిత్ర బృందం కాస్త విశ్రాంతి తీసుకుంటోంది.