బాలకృష్ణ నూరవ చిత్రానికి నేను దర్శకత్వం వహించట్లేదు – రాజమౌళి


బాలకృష్ణ నూరవ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారంటు వచ్చిన పుకార్లని ఎస్ ఎస్ రాజమౌళి ఖండించారు. “ఈగ” చిత్ర భారీ విజయం తరువాత మీడియా బాలకృష్ణ నూరవ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించనున్నారని ప్రకటించింది ఇంకొంతమంది మరో అడుగు ముందుకేసి ఆ చిత్రానికి ఏ పేరు పెట్టనున్నారని కూడా ప్రకటించింది. ఈ పుకార్లన్నింటికి రాజమౌళి మరియు కుటుంబ సభ్యులు ట్విట్టర్లో జవాబు ఇచ్చారు. “బాలకృష్ణ నూరవ చిత్రానికి నేను దర్శకత్వం వహిస్తున్నాను అని వచ్చిన వార్త నిజం కాదు” అని రాజమౌళి అన్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి మరియు ప్రభాస్ చిత్రం ఎప్పుడు మొదలు పెట్టనున్నారు అనే విషయాన్నీ దృవీకరించలేదు. మూడవ వారం కూడా “ఈగ” చిత్రం అద్భుతమయిన కలెక్షన్లను రాబట్టుతుంది. ఓవర్సీస్ లో ఈ చిత్రం అద్భుతమయిన వసూళ్లు రాబట్టుతుంది ఎంపిక చేసిన అమెరికన్ పట్టణాలలో ఈ చిత్రాన్ని సబ్ టైటిల్స్ తో ప్రదర్శించనున్నారు.

Exit mobile version