ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘1 -నేనొక్కడినే’ సినిమా దర్శకుడు సుకుమార్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూ లో ఎస్ ఎస్ రాజమౌళి ‘1-నేనొక్కడినే’ గురించి మాట్లాడారు. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను సుకుమార్ ను అడిగారు. ఈ సినిమాలో సుకుమార్ కొని సన్నివేశాలను ఎలా ఊహించి చిత్రికరించాడో గానీ చాలా బాగా చిత్రికరించదని అన్నాడు. సినిమా గురించి మాట్లాడుతూ ‘ఈ సినిమాని చూస్తూ నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో ఏ రెండు భావోద్వేగాలలో ఒకదానితో ఒకటి క్లబ్ అయి ఉండవు. అలాగే ఈ సినిమా ఇంటర్వల్ కు ముందు సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. సుకుమార్ కమర్షియల్, టెన్స్ రెండింటిని కలిపి ఇంత బాగా చిత్రీకరించడం నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అని అన్నాడు.
అనంతరం సుకుమార్ మాట్లాడుతూ తనకు ఈ ఐడియా ఎలా వచ్చిందనే విషయాన్ని అలాగే స్క్రీప్ట్ రాసుకున్న దాని గురించి తెలియజేశాడు. ‘నేను ఏం తియలనుకుంటున్ననో నాకు స్పష్టంగా తెలుసు. కానీ మొదటి సారిగా నేను సినిమా గురించి మహేష్ బాబుతో చెప్పడానికి భయపడ్డాను. కానీ ఆ తరువాత చాలా ఆనంద పడ్డాను. మహేష్ బాబు ఇది నిజంగా అద్భుతమైన ఆలోచన అని ప్రశంసించాడు’అని సుకుమార్ తెలిపాడు. చివర్లో రాజమౌళి సుకుమార్ కు అభినందనలు తెలియజేశాడు. అలాగే ‘నేను కొన్ని సార్లు అనుకుంటూ వుంటాను. నాకు రాని థాట్స్ సుకుమార్ అలా ఎలా వస్తున్నాయని అనిపిస్తు ఉంటుంది. సామాన్యంగా అతనిపై జలసి ఉంటుంది. కానీ సుకుమార్ ఫ్రెండ్ కాబట్టి నాకు ఆ జలసి లేదు’ అని అన్నాడు.
‘1- నేనొక్కడినే’ లో మహేష్ బాబు సరసన కృతి సనన్ నటించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.