కరోనా క్వారంటైన్ లో రాజమౌళి వరుసగా టీవీ ఛానెల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. నేడు కూడా ఆయన ఓ టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళిని పవన్ తో సినిమా గురించి అడుగగా ఆయన ఆసక్తికరంగా స్పందించారు. పవన్ తో మీరు ఇంత వరకు మూవీ చేయకపోవడానికి కారణం ఏమిటని అడుగగా, గతంలో నేను ఆయన్ని కలిసి సినిమా గురించి మాట్లాడడం జరిగింది… ఐతే అది కుదరలేదు అన్నారు. ఇక ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడం కుదరదు. ఆయన రాజకీయాల్లో ఉండడం వలన తక్కువ సమయంలో సినిమా చేయాలంటారు. నేనేమో ఏళ్ల తరబడి సినిమాలు తీస్తాను.. కాబట్టి ఆయనకు నాకు సెట్ కాదు అని రాజమౌళి చెప్పారు.
ఇక మీ ఇద్దరి లో సామాజిక స్పృహ ఎక్కువ కదా.. అని అడుగగా ఆ విషయంలో ఆయనతో నాకు పోలికేంటి. సామాజిక సేవలో ఆయనకి వంద మార్కులైతే, నాకు కేవలం పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తాయి. ఆ విషయంలో పవన్ తో నన్ను పోల్చకండి అన్నారు. రాజమౌళి తాజా వ్యాఖ్యలతో ఇక పవన్- రాజమౌళి కాంబినేషన్ లో మూవీ కలే అని తెలిసిపోయింది. ఇక రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ప్రకటించిన సంగతి తెలిసిందే.