అప్పుడు ఎన్టీఆర్ రాజమౌళికి అస్సలు నచ్చలేదట..!

అప్పుడు ఎన్టీఆర్ రాజమౌళికి అస్సలు నచ్చలేదట..!

Published on Apr 19, 2020 8:21 AM IST

టాలీవుడ్ లో దర్శకుడ ధీరుడు రాజమౌళికి మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న అనుబంధం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఎన్టీఆర్ తో ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ వీరి కాంబినేషన్ లో వస్తున్న 4వ చిత్రం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే రాజమౌళితో నాలుగు సినిమాలు చేసిన హీరోగా ఉన్నారు. కాగా ఎన్టీఆర్ తో మీకు గల ఓ మెమరబుల్ సంఘటన గురించి చెప్పండి అని రాజమౌళిని తాజా ఇంటర్వ్యూలో అడుగగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.

స్టూడెంట్ నంబర్ వన్ దర్శకుడిగా రాజమౌళికి మొదటి చిత్రం కాగా ఎన్టీఆర్ కి అది రెండవ మూవీ. ఆ సినిమా సమయానికి ఎన్టీఆర్ వయసు కేవలం 19ఏళ్ళు అట. టీనేజ్ లో ఉన్న ఎన్టీఆర్ బొద్దుగా, నూనూగు మీసాలతో ఉన్నాడట. ఆయన్ని చూసిన రాజమౌళి దర్శకుడిగా ఎన్నెన్నో ఊహించుకున్నాం..నాకేంటి ఇలాంటి హీరో దొరికాడని నిరాశ చెందాడట. ఐతే లుక్ పరంగా రాజమౌళిని డిస్సప్పాయింట్ చేసిన ఎన్టీఆర్ తరువాత యాక్టింగ్, డాన్సులు ఇరగదీయడంతో, ప్రేక్షకులను మైమరపించే గొప్ప టాలెంట్ ఇతనికి ఉంది అని గ్రహించాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు