మోహన్ లాల్ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి !

మోహన్ లాల్ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి !

Published on Apr 21, 2020 12:00 AM IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రాజమౌళి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించినట్లు.. మోహన్ లాల్ కూడా ఆ ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి, అయితే రాజమౌళి అసలు ఈ సినిమాలో మోహన్ లాల్ నటించట్లేదని స్పష్టం చేశారు.

ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు