అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ గా కెరీర్ ని మొదలు పెట్టి సినిమా రంగం పై ఉన్న ఇష్టంతో చిత్రం పరిశ్రమలోకి అడుగు పెట్టారు రాజ్ & డికె. మొదట్లో తెలుగులో సినిమాలు చేయాలని ప్రయత్నించిన ఈ తెలుగు వారికి సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వెళ్లి సినిమాలు తీసి తమ టాలెంట్ ని నిరూపించుకున్నారు. ఇప్పుడు తెలుగులో ‘డీ ఫర్ దోపిడీ’ అనే సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా మీరు తీసే సినిమాలు ఒకేలా ఉండవు. దీనికోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అని అడిగితే ‘ మేము తీసిన ’99’, ‘గో గోవా గాన’, ‘డీ ఫర్ దోపిడీ’ యాక్షన్ తరహాలో సాగే వినోదాత్మక చిత్రాలు. ఇలా ఏ సినిమా చేసిన వినోదాత్మకంగా ఉండాలి. ప్రేక్షకులని నవ్విస్తూనే కొత్త విషయాల్ని చెప్పాలి. ప్రేక్షకులు సినిమాని ఎలా చూడాలని భావిస్తారో అలాంతో సీన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటామని’ రాజ్ & డికె సమాధానం ఇచ్చారు.
అలాగే డీ ఫర్ దోపిడీ గురించి మాట్లాడుతూ ‘ డీ ఫర్ దోపిడీ కేవలం ఒక దోపిడీ చుట్టూ తిరిగే కథ కాదు. మేము యువత పై ప్రయోగిస్తున్న వ్యంగ్య బాణం. యువతకు వారి బాధ్యతను గుర్తు చేసేలా ఉంటుందని’ తెలిపారు. సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ద్వారా సిరాజ్ కల్ల డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు .