హ్యాపీ డేస్ సినిమాలో నటించిన రాహుల్ త్వరలో ‘లవ్ యు బంగారం’ సినిమాలో నటించనున్నాడు. గోవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మారుతీ మరియు కె వల్లభ నిర్మిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన యువకుడి జీవితం ప్రేమలో పడ్డాక ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కధాంశం
ఈ సినిమా గురించి రాహుల్ మాట్లాడుతూ “నేను కధల ఎంపికలో గతంలో కొన్ని తప్పులు చేశాను. నేను ఆ తప్పులనుండి చాలా నేర్చుకున్నాను. ప్రేక్షకులు నా కొత్త సినిమాను ఎలా తీసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నా గురువు శేఖర్ కమ్ముల చెప్పిన విధంగా ఇండస్ట్రీలో నేగ్గుకురావాలంటే మంచి డైరెక్టర్, పేరున్న బ్యానర్ లపై సినిమాలు చెయ్యాలి. ఈ సినిమాపై నేను ఆనందంగా వున్నాను” అని అన్నాడు
హ్యాపీ డేస్ తరువాత రాహుల్ రైన్ బో, ముగ్గురు, ప్రేమ ఒక మైకం సినిమాలలో నటించాడు. తన ‘లవ్ యు బంగారం’ సినిమా జనవరి 24న విడుదలకానుంది