‘అందాల రాక్షసి’ ఫేం యంగ్ హీరో రాహుల్ మరియు బాగా పాపులర్ అయిన సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయం ఈ రోజు ఉదయం చాలా మంది నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. అలాగే ఈ వివాహ మహోత్సవం ఫిబ్రవరిలో ఉంటుందని సమాచారం. చాలా సినిమాల్లో సమంత కి వాయిస్ ఇవ్వడం వల్ల చిన్మయికి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ‘ఏమాయ చేసావే’ సినిమాలో సమంత చేసిన జెస్సీ పాత్రకి తన వాయిస్ ని అందించడంతో చిన్మయి బాగా ఫేమస్ అయ్యింది. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రాహుల్ ప్రస్తుతం కొన్ని చిన్న బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు.
వీరిద్దరూ కొద్ది రోజుల క్రితమే ఒకరినొకరు చూసుకొని ఓకే చేసుకున్నారు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు వీరి పెళ్ళికి అంగీకారం తెలిపారు.
ఈ సందర్భంగా రాహుల్ – చిన్మయిలకు 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..